పిచాక్ సాంగ్ 1 మిలియన్ వ్యూస్ 

30 Nov,2018

లక్కీ మీడియా సంస్థలో వస్తున్న 'హుషారు' పాటలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి  మ్యూజిక్ డైరెక్టర్ వరికుప్పల యాదగిరి పాడి,మ్యూజిక్ చేసిన - 'పిచాక్' పాట ఇప్పటికే ఆదిత్య మ్యూజిక్ ఛానల్ లో టాప్ ౩ ట్రెండింగ్ లో 1మిలియన్ వ్యూస్ దాటి  'హుషారు' సినిమా రేంజ్ ని అమాంతం పెంచేసింది.రాహుల్ రామకృష్ణ పైన ఎంతో డిఫరెంటుగా పిక్చరైజ్ చేసిన ఈ సాంగ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ్ణ కెరీర్ లో ది బెస్ట్ గా నిలుస్తుంది.  పూర్తి యూతఫుల్ కధాంశంతో తెరకెక్కిన ఈ హుషారు సినిమా డిసెంబర్ (ఏడున) 7న విడుదల అవుతుంది.  ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే గుంటూరు ,విజయవాడ ,ఖమ్మం ,వరంగల్ ,నెల్లూరు,రాజమండ్రి,తాడేపల్లి గూడెం,విశాఖపట్నం ,శ్రీకాకుళం ,కాకినాడ  సిటీ లో అన్ని ముఖ్య కాలేజెస్ లో సందడి చేస్తుంది.

బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఈ హుషారు కి రియాజ్ మరో నిర్మాత. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు .*తేజస్ కంచెర్ల ,తేజ్ కూరపాటి ,దినేష్ తేజ్ , అభినవ్ మేడిశెట్టి హీరోలుగా,దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లు గా నటించారు.రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్ర లో నటించారు.  

Recent News